ఉప్పల్ నియోజక వర్గంలో మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లాక్ష్మ రెడ్డికి మద్దతుగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న నియోజక వర్గం ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి,పార్టీ నాయకులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తుంటే లక్ష్మా రెడ్డి గెలుపు పక్క అయిపోయిందని అన్నారు. 407 భూత్ కార్యకర్తలు బాగా పనిచేసి లక్ష్మా రెడ్డి గెలిపించాలని కోరుతున్న అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ ఏమైపోతుందో అని అనుమానం ఉండే, కానీ ఇవాళ తెలంగాణ దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేక న్యూయార్క్ లో ఉన్ననా అని చెప్పాడని గుర్తు చేసారు. బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కూడా నేను హైదరాబాద్ లోనే ఉండాలి అని ఉంది అని ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో చెప్పాడు విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది అని ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి.
10 యేండ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో చిమ్మటి చీకట్లు ఉండేవన్నారు. ఇదే చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసేది, మంచి నీళ్లు లేక ఆనాడు మన హైదరాబాద్ అవ్వలు ఎంతో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఆనాడు మెట్రో పనులు చేస్కోలేని పరిస్థితి ఉండేదన్నారు. ఔషధాలకు అడ్డాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. కరోనాకు మందు కుడా మన దగ్గరే తయారు చేశారు. నగరం బాగుంటే మనం బాగుంటామని పేర్కొన్నారు.
మనం స్కై వాక్ అయితే మనం కట్టుకున్నాం. ఉప్పల్ ఫ్లై ఓవర్ వాళ్ళు కడుతాం అన్నారు. ఇప్పటికే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేసారు. ఉప్పల్ ఫ్లై ఓవర్,స్కై వే ను చూస్తే మోడీ పనితీరు,కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ఇక్కడ ఒకాయన ఎంపీ ఉన్నాడు ఆయన ఇక్కడకు రాడు ఇక్కడ బాధలు పట్టించుకోడని మండిపడ్డారు. వరదలు వస్తే రాడు… ఎల్బీనగర్లో నీళ్లు వస్తే రాడు ఏదో 5 వేల ఓట్లతో గెలిచిన ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
కేసీఆర్ స్థాయి ఎంత.. చిల్లర గాడు రేవంత్ రెడ్డి స్థాయి ఎంత? అని నిలదీసారు. పైసలు పంచం అని ప్రమాణం చేద్దాం అని సవాలు చేస్తున్నాడు. 50 కోట్లతో దొరికిన దొంగ అమరవీరుల దగ్గర ప్రమాణం చేద్దాం అన్నాడు. వీడా అమరవీరుల స్థూపం దగ్గర సవాలు అంటున్నాడు. కంటికి రెప్పలగా మిమ్ములను కపడుకుంది మీ కేసీఆర్. ఎంతో అభివృద్ధి చేసుకున్నాము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లక్ష్మా రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని విజ్ఞప్తి చేసారు.