అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కందికొండ కుమార్తె మాతృక..’ తన తండ్రికి సంబందించిన ఆసుపత్రుల ఖర్చు దాదాపు 20 లక్షల వరకూ భరించి తమను ఆర్థికంగా ఆదుకున్నారని..అందుకు ఎంతగానో రుణపడి ఉన్నామని.. అలాగే ఎక్కడైనా తమకు ఇంటిస్థలం కేటాయించాలని, మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేసింది.’ దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తప్పకుండా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. గతంలో మీ కుటుంబాన్ని ఆదుకున్నాం.. ఇకముందు కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా మీకు సహాయం అందించేలా నా బృందం చర్యలు తీసుకుంటుందన్నారు. ” మీ ట్వీట్ ను మా నాన్నగారికి చూపించాను, తను చాలా ఆనందించారు. తమ కుటుంబానికి వెలుగునిచ్చే దీపంగా ఉన్నందుకు ఎల్లవేళలా మీకు రుణపడి ఉన్నాం.. థాంక్యూ.” అంటూ మాతృక రిప్లై ఇచ్చారు.