mt_logo

కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన మంత్రి కేటీఆర్

తొర్రూరులో జరిగిన పాలకుర్తి నియోజకవర్గం సంక్షేమ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.దయాకర్ రావుని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తం అన్నారు. దయన్నను గెలిపిస్తమన్న రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలను పేర్కొన్నారు.  కేసీఆర్‌కు లెక్క కుదిరింది. ఇక 6 మనకు అచ్చొచ్చిన సంఖ్య అన్నారు. 

కేసీఆర్ ముద్దుగా మూడోసారి ముఖ్యమంత్రి అయినట్లే అని ఆశాభావం వ్యక్తం చేశారు. మనసుతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సూచించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కిందట ఎట్లున్నది? ఇవ్వాళ ఎట్లున్నది? ఆలోచించండని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సాగు నీరు, తాగు నీరు ఏ విధంగా ఉన్నాయి? ఆలోచించండి, దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం 30 శాతం అవార్డులు కొడుతున్నదని పేర్కొన్నారు. ఇదంతా ఉత్తిత్తిగా వస్తుందా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బంపర్‌ ఆఫర్

సీఎం కేసీఆర్ డైరెక్షన్, మంత్రి ఎర్రబెల్లి కృషితో తెలంగాణ ఇదంతా సాధించిందని అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా నిలిచారు,  ఒకప్పుడు ఒక గంగాదేవి పల్లి మాత్రమే ఆదర్శ గ్రామంగా ఉంటే, ఇవ్వాళ రాష్ట్రంలో గ్రామాలన్నీ ఆదర్శంగా మారాయి.  గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కలిగాయన్నారు.  ట్రాక్టర్, ట్రాలీ, డంపింగ్ యార్డ్ వంటివెన్నో వచ్చాయి. ఒకప్పుడు కరెంటు వస్తే వార్త, ఇవ్వాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త అని స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుంటే, ఒక అనుమానపు పక్షి, ఎంపీ ఏదేదో మాట్లాడుతున్నారు.  కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న.. పాలకుర్తిలో కరెంటు వైర్లు పట్టుకోండి… కరెంటు ఎట్లుందో తెలుస్తుంది. తెలంగాణకు పట్టిన పీడ పోతుందన్నారు. 

విమానం, ప్రమాణం వదిలేయాలి 

నాడు ఎంత ఘోరంగా పరిస్థితులు ఉండే. ఇవ్వాళ ఎట్లున్నదని అడిగారు. ఇంటింటికి నీళ్లు ఇస్తా, ఇవ్వక పోతే ఓట్లు అడగను అనే దమ్ము ఎవరికి ఉంది? ఒక్క కేసీఆర్‌కు తప్ప అని అన్నారు. మంచినీళ్లు ఇవ్వాలని, సాగు నీరు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్ల లాగా వస్తున్నారు.  రూపాయలు సరిపోతలేవని, డాలర్లతో వస్తున్నారు. దయాకర్ రావు కావాలా? చుట్టపు చూపుగా వచ్చే అమెరికా వాళ్ళు కావాలా? తేల్చుకోండన్నారు. ఇస్తే వద్దనకుండా మంచిగా తీసుకోండి…  ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండని అన్నారు. విమానం, ప్రమాణం, వదిలేయాలి ఓటు మాత్రం కారుకే వేయాలన్నారు.  

రేపు వచ్చేది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే 

కోటి మందికి కేసీఆర్ కిట్లు ఇస్తున్నందుకు, 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నందుకు, సర్కారు దవాఖానకు పోతే, సుఖ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏడాదికి 8,500 కోట్ల ఖర్చుతో అవాస స్కూల్స్, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ లాంటి పథకాలు ఇస్తున్నాం,  60 ఏళ్లు చావగొట్టిన కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నది.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తామా? అని అడిగారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆర్, రేపు వచ్చేది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని అన్నారు. 

మీకు అపతి సంపతిలో ఆదుకునే దయాకర్ రావు అని తెలిపారు. ఇది రాష్ట్ర తల రాతను మార్చే ఎన్నికలు అని గుర్తు చేసారు. సీఎం కేసీఆర్ మళ్ళీ  సీఎం అయ్యే ఎన్నికలు, మన పార్టీ జాతీయ స్థాయికి ఎదిగే ఎన్నికలు, మన ఖ్యాతి ఢిల్లీకి చేరే ఎన్నికలని సూచించారు.