mt_logo

తెలంగాణలో  స్టేబుల్ గవర్నమెంట్ వల్లే పరిశ్రమల వెల్లువ: మంత్రి కేటీఆర్ 

సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రీలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో  ఇంటరాక్టివ్ మీటింగ్‌కి మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికల పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తమకు అలాగే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు పని చేస్తూనే ఉంది. తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణలో ఏమి జరిగింది, మాకు ఎందుకు ఓటు వేయాలో..  నేను ఇక్కడకి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చిన, మీ మద్దతు కోసం పారిశ్రామికవేత్తలాగా కాకుండా ఒక్క పౌరిడిగా ఆలోచన చేయండని కోరారు. 

తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ గారిని ఎంత మంది ఎన్ని మాటలు అన్నారో గుర్తు చేసుకోండని అన్నారు. పరిపాలన రాదు, కరెంట్ ఉండదు ఆంధ్ర వాళ్ళను వెల్లగొడతారు అని, గొడవలు జరుగుతాయి అని అన్నారు. భూములు విలువ పడిపోతుంది అని కొంత మందికి అనుమానాలు, అపోహలు. పరిశ్రమలకు టైం బాండ్ పర్మిషన్స్ ఇస్తున్నారా? అని ఆనాడు సీఎం కేసీఆర్ అధికారులును అడిగితే సరైన సమాధానం రాలేదన్నారు. రెండు రోజులు పాటు పవర్ హాలిడే ఉంటే కార్మికులు ఎలా బ్రతుకుతారు అని అన్నారు. పవర్ సమస్య ఎంత తీవ్రంగా ఉండే తెలంగాణలో ఆనాడు, 10 నిముషాలు కరెంట్ పోతే ఇప్పుడు తట్టుకోలేపోతున్నారని తెలిపారు. 

కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చారు, పాపం అయినాకి స్క్రిప్ట్ ఇవ్వలేదు, కర్ణాటక లో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటే కింద ఉన్న వారు నవ్వుతున్నారు. భారతదేశంలో అత్యధిక తలసరి  ఆదాయం 3లక్షలు 17 వేలు దాకా ఉందన్నారు. 2014 కు ముందు నగర్ శివరాలు 14 రోజులకు ఒక్కసారి నీరు వచ్చేవన్నారు. ఇప్పుడు రోజు వస్తున్నాయ్.. మా ఆలోచన లు ఇంకా ఉన్నాయి 24 గంటలు నీళ్లు ఇవ్వాలి అనేది ఆలోచన అని తెలిపారు. మీరు చూసింది ట్రైలర్ మాత్రేమే ఇంకా చాలా ఉందన్నారు. 

2014కు ముందు భూములు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని అడిగారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకి పరిశ్రమల వస్తున్నాయ్ అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వలన అని అన్నారు. ప్రభుత్వం స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బ తినేది పరిశ్రమలే అన్నారు. అధికారంలోకి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఢిల్లీకి వెళ్లి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలని సూచించారు. అవినీతి లేకుండా తమ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సహం అందించిందని స్పష్టం చేసారు.