ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో భారత్ సీరమ్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ సి ఓ ఓ విశ్వనాధ్ స్వరూప్ ,ప్రతినిధులు, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష గణాంకాల ప్రకారం శిశువులకు తల్లిపాలు అందించడంలో దేశ సగటు 63 శాతం ఉంటే తెలంగాణ మొత్తం 68 శాతంతో అగ్రగామిగా నిలిచింది. బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. భవిష్యత్తులో బిడ్డలకు రోగాలు రాకుండా కాపాడటం లో తల్లి పాలు కీలక పాత్ర వహిస్తాయి. అందుకే తల్లిపాలను ద్రవ బంగారం గా పిలుస్తారని అన్నారు. నవజాత శిశువులకు పాలు పట్టడం ద్వారా తల్లికి కూడా ప్రయోజనం కలుగుతుందని సూచించారు. పాలిచ్చే తల్లులకు భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచన చేసారు మంత్రి.