mt_logo

రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ రోడ్డుకు భూమి పూజ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ. 18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ వరకు నిర్మించే రోడ్డు కోసం మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మాట మార్చింది. గెలిస్తే మహిళలకు ఉచిత బస్ అన్నారు, బంద్ చేశారు. కరెంట్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరిచారు. కర్ణాటకలో ఇక్కడ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు లేవని గుర్తు చేశారు. 

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే

ఇక్కడికి వచ్చి ఉద్దరిస్తం అంటున్నారు. కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు అని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే జూటా పార్టీ. తండా తండాకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని పేర్కొన్నారు.గల్లీ గల్లీలో బారాన మందం రోడ్లు వేశాం. నాడు ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థలు అన్ని కాంగ్రెస్ వాళ్ళవే, కేసీఆర్ రైతు గౌరవం పెంచాడు అందుకే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువ. కర్ణాటకలో దిక్కు లేదు. ఈసారి భూపాల్ రెడ్డి గెలిస్తే బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి ముందుకు నీళ్ళు తెస్తామని అన్నారు. 70 ఏళ్ళల్ల కాంగ్రెస్ వాళ్లు తాగు నీళ్లు ఇవ్వలేదు. మేము తాగు మాత్రమే కాదు, సాగు నీళ్ళు తెస్తామని స్పష్టం చేశారు.