mt_logo

రూ. 40 లక్షలతో హుస్నాబా‌ద్‌లో ‌ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతా రామాంజనేయ ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని రూ. 40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసారు.  ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు  మాట్లాడుతూ..

కేసీఆర్ నికార్సైన హిందువు.. రూ. 1200 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. రూ. 600 కోట్లతో కొండగట్టును అభివృద్ధి చేస్తున్నారు. అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కొరకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. 10,000 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం పథకం కింద ఇచ్చే గౌరవ భృతిని రూ. 6,000 నుంచి రూ. 10,000 పెంచి ఇస్తున్నాము. ఈ గ్రామంలో 140 గుళ్ళున్నాయని అనేవాళ్ళు. అలాంటి ఈ గ్రామంలో 40 లక్షల రూపాయలతో రామాలయాన్ని మళ్ళీ నిర్మించడానికి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది.

సీఎం కేసీఆర్ దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుండి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయి. తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగామని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చింది కేసీఆరే కదా? అని గుర్తు చేశారు.