mt_logo

బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. డయాలసిస్ సేవలు తెచ్చాం. ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి తెచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారింది కేసీఆర్ పాలనలో అని పేర్కొన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారు. నాడు 30 శాతం ప్రభుత్వ డెలివరీలు నేడు 76.8 శాతం అని స్పష్టం చేశారు. 

పిల్లలకు ఉపాహారం ఇచ్చే పథకం అద్భుతం

మోదీ వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడాడు. డబుల్ ఇంజన్ ఫెయిల్ అయ్యింది. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లో ఎలాంటి పరిస్థితి ఉంది.నాందేడ్ ఆసుపత్రిలో 40 మంది పిల్లలు చనిపోయారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కళ్యాణ లక్ష్మి ఉందా, రైతు బంధు ఉందా, 24 గంటల కరెంటు ఉందా? అని అడిగారు. ఇక్కడ కరెంటు లేదు అంటున్నారు వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది. 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. పిల్లలకు ఉపాహారం ఇచ్చే అద్భుత పథకం ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గొడ్డు కారం తో అన్నం పెడితే, సీఎం కేసీఆర్ విద్యార్ధులకు మమకారంతో అన్నం పెడుతున్నారని అన్నారు. 

గాంధీ భవన్‌లో అప్లికేషన్ కోసం డబ్బులు వసూలు

ఎస్ఎఫ్‌టీ చొప్పున బెంగళూరులో డబ్బులు వసూలు చేస్తున్నారు. అవినీతిలో కూడుకు పోయారు. మొన్న చెప్పిన హామీలు కర్ణాటకలో అమలు చేయలేని పరిస్థితి. మోటార్లకు మీటర్లు పెట్టలేదని, 35 వేల కోట్ల రూపాయలు ఆపింది కేంద్రం. కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తున్నది. మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నది. గాంధీ భవన్‌లో మొన్నటి దాకా అప్లికేషన్ కోసం డబ్బులు వసూలు చేశారు, ఇప్పుడు సీట్లు అమ్ముకుంటారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు.