mt_logo

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్ఎన్‌జే  ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం (32 కోట్లు), లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ (50 లక్షలు) ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో కేవలం 3 ఓటీలు మాత్రమే ఉండేవి. అవి కూడా దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినవని తెలిపారు.  కొత్తగా నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు. ఉన్న ఓటి కాంప్లెక్స్ లో సరైన వసతులు లేవు, air purification, equipment, stands, సరైన వెంటిలేషన్, సెంట్రల్ ఏసీ లేక ఇలా అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. 

రూ. 32 కోట్లతో రోబోటికల్ సర్జికల్ ఎక్వైంట్

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు అయిన తరవాత ఎమ్ఎన్‌జే ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారని స్పష్టం చేసారు. ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో 8 అధునాతన రోబోటిక్ సహా ఎనిమిది మాడ్యులర్ థియేటర్లను ఇప్పటికే ప్రారంభించాం. రూ. 32 కోట్లతో రోబోటికల్ సర్జికల్ ఎక్వైంట్ సమకూర్చుకొని ప్రారంభించాం. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికత ఇది. రోబో ఎక్విప్మెంట్ ద్వారా మరింత వేగంగా, ఖచ్చితత్వంతో ఆపరేషన్‌లు చేయడం సాధ్యం అవుతుంది. 

దేశంలో అతిపెద్ద కేన్సర్ ఆసుపత్రిగా రికార్డు

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎమ్ఎన్‌జే ఆసుపత్రి దశ మారింది. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. పక్కనే మరో 350 పడకలతో కొత్త బ్లాక్ ప్రారంభించుకున్నాం. మొత్తం 750 పడకల ఆసుపత్రిగా దేశంలో అతిపెద్ద కేన్సర్ ఆసుపత్రిగా రికార్డు నెలకొల్పింది. ముంబైలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ 600 పడకలు,  చెన్నైలో అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ 545 పడకలు, బెంగళూరులో కిద్వాయి క్యాన్సర్ హాస్పిటల్ 746 పడకలు. మన ఎమ్ఎన్‌జే అందిస్తున్న సేవలు, ఢిల్లీలోని ఎయిమ్స్ ద్వారా అందిస్తున్న సేవలకు సమానమని తెలిపారు.  తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేడియేషన్ ఎక్విప్ మెంట్, లైనాక్, PET CT, CT స్కాన్  మిషన్, మాడ్యులర్ లాబ్స్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ సిస్టం వచ్చిందని తెలిపారు. 

2 లక్షల 22వేల మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ 

కార్పొరేట్ లో ఖరీదైన సేవలను, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. దేశంలో తొలిసారి ఎమ్ఎన్‌జే ఆధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ త్వరలో ప్రారంభిస్తాం. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాము. మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్క్రీనింగ్ సేవలు చేరువ చేస్తున్నాం. మొబైల్ స్క్రీనింగ్ ద్వారా జిల్లాల్లో 20 క్యాంపులు పెట్టి 200 మందిని గుర్తించాము. ఇక్కడ మంచి చికిత్స అందిస్తున్నాం.  272 ఆరోగ్య మహిళ కేంద్రాల ద్వారా 2 లక్షల 22 వేల మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాం. ఇందులో కేన్సర్ లక్షణాలు ఉన్న వారినీ ఎమ్ఎన్‌జే తరలించి, మంచి వైద్యం అందిస్తున్నాం. మరో వందకు అరోగ్య మహిళ కేంద్రాలు పెంచాం. మొత్తం 373 అయ్యింది.  ఆరోగ్యశ్రీ  పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ. 100 కోట్లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో సేవలందిస్తున్నామని తెలియజేసారు. 

రూ. 120 కోట్లతో  స్టేట్ క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి

2014-15 లో 69 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది 120 కోట్ల దాకా ఖర్చు చేసాము. అంటే డబుల్ అయ్యింది. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తంగా రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. ఎమ్ఎన్‌జే మరియు నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచుకుంటున్నాము. ఎమ్ఎన్‌జే ఆసుపత్రి రూ. 120 కోట్లతో  స్టేట్ క్యాన్సర్ సెంటర్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం నిమ్స్, ఎమ్ఎన్‌జేలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి ( బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు.

ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో తెలంగాణ దేశంలోనే no.1

ప్రైవేటులో 25 లక్షల ఖర్చు అయ్యే బొన్ మారో ట్రాన్స్ ప్లాంటేశన్ చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నాం.  ఎమ్ఎన్‌జేలో గత 6 నెలల్లో 30 కేసులు చేశాం. 98% సక్సెస్ రేట్. తక్కువ సమయం, తక్కువ కోత, తక్కువ నొప్పి, తక్కువ బ్లడ్ లాస్, తక్కువ కాంప్లికేషన్స్. అవసాన దశలో ఉన్నవారికి సేవలు అందించేందుకు ఉద్దేశించిన పాలియేటివ్ కేర్ సేవలను 33 జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నాం. అవసరం ఉన్న చోట ఇంటి వద్దే పాలియేటివ్ కేర్ సేవలు. కేన్సర్ బాధితులకు ఇది అండగా నిలుస్తున్నది. వీరి కోసం ప్రత్యేకంగా ఆలనా వాహనాలను ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇలా ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో తెలంగాణ దేశంలోనే no.1 అని పేర్కొన్నారు.