–త్వరలో మనోహరాబాద్‌కి పోలీస్ స్టేషన్
రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటంలో భాగంగా మనోహరాబాద్‌లో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మనోహరాబాద్‌లో పీహెచ్సీ ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్ మండలం చేయాలని దశాబ్దాల కల ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని తెలిపారు.
త్వరలో మనోహరాబాద్‌కి పోలీస్ స్టేషన్
ఈరోజు మనోహరాబాద్ మండలమైంది ఈ మండలంలో 24 గంటలు పనిచేసే పీహెచ్సీ ప్రారంభించుకుంటున్నామని అన్నారు. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటుంది. గర్భిణీలకు చెకప్‌లు కూడా ఇక్కడ జరుగుతాయిని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా? అని అడిగారు. త్వరలో మనోహరాబాద్‌కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు.
కష్టాలు తీరుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్
ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76% డెలివరీలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ తెచ్చి డెలివరీ అయ్యాక ఆటోలో ఇంటి దగ్గర దింపుతున్నామని గుర్తు చేసారు. ఈరోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేసారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుంది అంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైందన్నారు. తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఈ రోజు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే సీఎం కేసీఆర్ కృషివల్లే అని పేర్కొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన కేసీఆర్‌ని ఆశీర్వదించాలని కోరారు.