కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల అమలు తీరు పై హద్నూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ఆరా తీసారు. విద్యుత్ సరఫరా..పెన్షన్ల్.. తదితర పథకాల పై కర్ణాటక రాష్ట్రంలో బంధుత్వాలు ఉన్నవారిని మంత్రి హరీష్ రావు.. అడిగి తెలుసుకున్నారు. ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు, మరొక బీఆర్ఎస్ కార్యకర్తతో కర్ణాటక ప్రజల కష్టాల పై సభ వేదిక పై వారితోమంత్రి మాట్లాడించారు. కర్ణాటక రాష్ట్రంలో మూడు గంటల కరెంట్ కూడా సరిగా రావడం లేదని..ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కార్మికుడు మల్లేష్ యాదవ్..రవిందర్ రెడ్డి మంత్రికి తెలిపారు.