చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నడు, మేము మాట్లాడగలం అని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. బూటుతో కొట్టాలి అని నేను కూడా అనగలను కానీ, బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలని అన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గుండెల మీద చెయ్యి వేసి ఆలోచించాలి.. నాటి తెలంగాణ, నేటి తెలంగాణ ఎలా మారిందో..ఆలోచించి పౌరులు ఓటు వేయాలని కోరారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు.