రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రులు, బిల్లును రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండలిలో ప్రవేపెట్టారు. ముఖ్యమంత్రి గారు మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థ గా తీర్చిదిద్దిన నేపథ్యంలో రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్టు మంత్రి తెలిపారు. పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.
2014 లో 17వేల పడకలు – ఇప్పుడు 34 వేల పడకలు
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. 65 ఏళ్లలో నిజాం, బ్రిటిష్ వారు ఏర్పాటుచేసిన ఆసుపత్రిలోనే గత పాలకులు వైద్య సేవలను కొనసాగించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మించుకున్నాం. అదేవిధంగా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలు అందిస్తాయన్నారు.
ఇంతటి వైద్య సదుపాయాలు రాష్ట్రంలో అందుతున్నాయి అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వారికి వైద్యరంగంపై ఉన్న అంకితభావమే కారణమన్నారు.
టిమ్స్ లో 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
కరోనా కాదు దానికంటే ప్రమాదకరమైన వైరస్లు వచ్చినా వైద్యాన్ని అందించే శక్తి ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఉంది. 2014 లో 17వేల పడకలు ఉంటే ఇప్పుడు 34 వేల పడకలు ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో 50 వేల పడకలకు పెంచబోతున్నామని చెప్పారు. టిమ్స్ లో 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నాము. టీమ్స్ లో 200 మంది ఫ్యాకల్టీ, 500 వరకు పెద్ద నిపుణులు పనిచేస్తారు. అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు ఈ టిమ్స్ లో ఏర్పాటు చేయనున్నాము. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య సేవలు అందించబోతున్నామన్నారు.
30 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రోబో ఎక్విప్మెంట్ సర్జరీలు
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్ గా, వ్యాక్సిన్ హబ్ గా ఉంది. ఇప్పుడు హెల్త్ హబ్ గా మారింది. 30 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రోబో ఎక్విప్మెంట్ సర్జరీలు నిమ్స్ లో జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రిలోనే ట్రాన్స్ ప్లాంటేషన్ అధికంగా జరుగుతున్న విషయాన్ని గ్రహించిన మేము ప్రైవేట్ ఆస్పత్రులతో మీటింగ్ జరిపి ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రాన్స్ ప్లాంటేషన్ ఉచితంగా చేసి వారిని తిరిగి ఆరోగ్యవంతంగా ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అవార్డు
అదేవిధంగా నిమ్స్ లో మూడు ట్రాన్స్ ప్లాంటేషన్లు ఒకేరోజు చేసి చరిత్ర సృష్టించాము. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిమ్స్ లో జరిగాయి.పైసా ఖర్చు లేకుండా నిమ్స్ లో ఆర్గాన్ ట్రాన్స్ఫర్ ప్లాంటేషన్ చేస్తున్నాం. దేశంలో అత్యధిక ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ తెలంగాణ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. విదేశాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ నగరంలో ట్రాన్స్ ప్లాంటేషన్లు చేపించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కి వచ్చి వైద్యం పొందుతున్నారు.
విపక్ష సభ్యులు నర్సిరెడ్డి గారు కూడా నిమ్స్ గురించి గొప్పగా చెప్పడం సంతోషించదగ్గ విషయం
ప్రతిరోజు ఉదయం నిమ్స్ డైరెక్టర్ నాకు నిమ్స్ బెడ్ ఆక్యుపెన్సీ పైన మెసేజ్ పంపిస్తారు. అందులో నిమ్స్ 1500 బెడ్ కెపాసిటీ ఉంటే ప్రతిరోజు 1500 లకు అదనంగా ఒక పది పదిహేను పడకలు ఎక్స్ట్రాగా వేసి సేవలందిస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే చేసిన పనిని గుర్తించి దాన్ని అభినందిస్తే ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. 99% మంచి చేసి ఒక్క శాతం చెడు జరుగుతే దాన్నే ఎత్తిచూపి వ్యవస్థను లోపం ఉందని చెప్పడం దురదృష్టకరం. మంచిని అభినందించాలి తద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తాం అన్నారు.
నిమ్స్ లో 150 వెంటిలేటర్లు
నర్సిరెడ్డి గారు టిమ్స్ కి అన్ని కలిపి ఒక డైరెక్టర్ ఉంటారా లేక ప్రతి టిమ్స్ కి ఒక డైరెక్టర్ ఉంటారా అని అడిగారు. టిమ్స్ మొత్తం కు కలిపి బోర్డు ఉంటుంది కానీ ప్రతి టీమ్స్ కి ఒక డైరెక్టర్ నియమింపబడతారని వివరించారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు మెరుగుపడ్డాయి ఉస్మానియా గాంధీ నేమ్స్ లో వైద్య సేవలు మెరుగుపడ్డాయి అన్నారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. నిమ్స్ లో ఈరోజు 150 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి. సీఎం కేసీఆర్ గారు ఇప్పటికే నిమ్స్ కి అదనంగా 156 కోట్లు నిధులు ఇవ్వడం వల్ల రోబోటిక్ ఎక్విప్మెంట్లు గాని ఇతర ఆత్యాధునిక సదుపాయాలు గాని ఏర్పాటు చేయగలిగాము.
3002 పల్లె దవాఖానాలు, 434 బస్తీ దావఖానాలు
నూతనంగా ఏర్పాటు అయిన మండలాల్లో పీహెచ్సీలు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి గారు అడిగారు. పీహెచ్సీ ప్రాథమిక వైద్యం అందించే కేంద్రంగా ఉంటుందని సమాధానం ఇచ్చారు. పీహెచ్ సీ సెంట్రిగ్గా చేసుకొని ప్రతి గ్రామంలో సబ్ సెంటర్ పల్లె దవాఖాన ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. మండలం ఏర్పడినంత మాత్రాన వైద్య సేవలు అందట్లేదు అని అనుకోవద్దన్నారు.
అదేవిధంగా ఏఎన్ఎం సబ్ సెంటర్ ను పల్లె దవాఖానగా అప్డేట్ చేసి ఒక డాక్టర్ నర్స్ తో వైద్య సేవలు అందిస్తున్నాం. 134 టెస్టులను ఉచితంగా ప్రభుత్వం జిల్లాలో, పట్టణాల్లో నగరాల్లో ప్రతి సెంటర్ ద్వారా చేస్తుంది. చేయడమే కాకుండా ఈ టెస్ట్ ల యొక్క రిపోర్టులను పేషెంట్ ఫోన్కు, డాక్టర్ ఫోన్ కు నేరుగా పంపిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 3002 పల్లె ధవాఖనాలు, 434 బస్తీ దావఖానాలు , ప్రతి మండలానికి పీహెచ్సీ ప్రతి నియోజకవర్గానికి వంద పడకలు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, పదివేల సూపర్ స్పెషాలిటీ పడకలతో నూతన ఆసుపత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు.