mt_logo

కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో తెలంగాణని పెడితే అభివృద్ధి కుంటుపడుతుంది: మంత్రి గంగుల

కాంగ్రెస్, బీజేపీ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బొమ్మకల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009 గా నన్ను గెలిపించి ఆశీర్వాదం అందించారని గుర్తు ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం నాకే కలిగిందన్నారు. మూడోసారి కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు, బొమ్మకల్ నుండి ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యమని అన్నారు. కరెంటు నీళ్లు లేక రైతులు ఆగమయ్యారన్నారు. కరెంటు ఎప్పుడు వస్తదని రైతుల ఎదురుచూపులు ఉండేవన్నారు. కరువు కాటకాలతో రైతులంతా దుబాయ్ కి వలసలు వెళ్లారని తెలిపారు. 

మానేరు డ్యామ్ తలాపుకు ఉన్న తాగటానికి చుక్క నీరు లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో ఉంటే.. బీజేపీ కాంగ్రెస్ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు.  తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుందని పేర్కొన్నారు.కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేమన్నారు. ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి పట్టం కట్టాలని తెలిపారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ లో తీర్చిదిద్దుతా అన్నారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజాసమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలని సూచించారు.