mt_logo

కాంగ్రెస్‌ని నమ్మొద్దు.. కొడంగల్‌లో కర్ణాటక రైతుల ర్యాలీ

వికారాబాద్ జిల్లా, కొడంగల్: కర్ణాటక రాష్ట్రంలో 6 గ్యారెంటీ పథకాల హామీతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు నెల తిరక్క ముందే… ఇవ్వకుండా చేతులెత్తెసిందని తెలుపుతూ.. నిరసిస్తూ, ఆ పార్టీకి ఓటు వేసి మోసపోరాదని కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో కొడంగల్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాల ప్లే కార్డులు ప్రదర్శిస్తూ కర్ణాటక ప్రజల భారీ ర్యాలీ నిర్వహించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, నమ్మి ఓటు వేసి తాము మోసపోయామని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోరాదని కర్ణాటక ప్రజలు విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో కర్ణాటక ప్రజలకు ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారని, ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు నిలదీసారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ముందే బైఠాయించి న్యాయం చేయాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన వ్యక్తం చేశారు.