mt_logo

తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారు

తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి ఈ రోజు  ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీనే మా‌ భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుండి‌ అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని చెప్పారు. ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారని మండి పడ్డారు. రేపు అధికారం ఢిల్లీ చేతిలో కాదు,కేసీఆర్ చేతిలో పెట్టాలని అన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తు కేసీఆర్ ‌కాపాడుతారని స్పష్టం చేసారు. 

కేసీఆర్ లేని తెలంగాణని ఊహించుకోలేం 

మూడుసార్లు గెలిపించారు, నాలుగవసారి మరోక అవకాశం ఇవ్వండి‌ ఇంకా అభివృద్ధి చేస్తానని విజ్ఞప్తి చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయని గుర్తు చేశారు. ఆంధ్రా ముసుగులో లిడర్లు వస్తున్నారు, నమ్మవద్దని సూచించారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ రావాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలకులు ఆంధ్రాలో కలుపుతారని హెచ్చరించారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ‌ఇవ్వండని కోరారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల ఉండాలన్నారు.  పదమూడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, కేసీఆర్ లేని తెలంగాణని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు. 

తెలంగాణను ఎత్తుకుపోవడానికి చూస్తున్నారు 

కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణనే అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారికి ఓటు వేయవద్దని సూచించారు. భూ ఖబ్జా చేతుల్లోకి, మతతత్వ పార్టీ చేతుల్లోకి అధికారం పోవద్దు. 18 నుంచి అందరూ రంగంలోకి దిగుతామన్నారు. ఎన్నికలప్పుడు వచ్చిన వారిని నమ్మొద్దన్నారు. ఈటెల రాజేందర్ భయపడే హుజురాబాద్‌లోనూ పోటీ చేస్తాను అంటున్నారు. ఈటెల రాజేందర్ బీజేపీ ‌పార్టీలో తన ఆధిపత్యం కొరకే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ భీపాంలు బీజేపీ ఆపీసులో, కాంగ్రెస్ ఆఫీసులో బీజేపీ పార్టీ భీపాం‌ తయ్యారు అవుతాయి. హైదరాబాద్ సంపద కొల్లగొట్టడానికే వస్తున్నారని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? అని అడిగారు. అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపోవడానికి చూస్తున్నారని అన్నారు. 

గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా?

 బండి‌సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు.  కరీంనగర్ గంజాయి రహితంగా గా ఉండాలని సీపీకి‌ ఇంతకు ముందే  చెప్పాం, 2019 లో మాకు పేపర్లో అడ్స్ కి‌ కూడా అవకాశం ఇవ్వలేదు… అప్పుడు‌ కూడా సర్వేలు కాంగ్రెస్‌కే అన్నారు, మేమే అధికారంలోకి వచ్చామని తెలిపారు. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి.కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలం అయ్యింది. కర్ణాటకలో పథకాలు అమలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.. ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏం ఇస్తారని అన్నారు. బీజేపీ పార్టీకి‌ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ‌లేదు ఈటెల సీఎం ఎలా అవుతాడని అడిగారు.