![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/10/Untitled-Project-20-1.jpg?resize=1024%2C576&ssl=1)
జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డిలతో కలిసి మీడియాతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతుంది, డబ్బులకు టికెట్స్ అమ్ముకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాల్లే విమర్శిస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లు అమ్ముకుంటడు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతండని అన్నారు. నీ లాగా మాకు రోత మాటలు రావు, నువ్వు తిమ్మిని బమ్మి చేస్తావని అన్నారు. గోడలకు పెయింటింగ్‌లు వేసే వాడివి… నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు, నీ కుటుంబ మేంది? నీ బతుకేంది.? సంవత్సరానికి ఒక పార్టీ మారే బతుకు నీదని అన్నారు.
కొడంగల్‌లో చిత్తుగా ఓడిపోయావు, బ్రోకరు మాటలెందుకు, దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలువని సవాల్ చేశారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని పేర్కొన్నారు. పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ మొత్తం పడిపోతదని అన్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, పక్క రాష్ట్రాల్లో 6 గ్యారెంటీలు ఇయ్యని మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్రజలు ఎట్ల నమ్ముతారు.? అని అడిగారు. ఒకప్పుడు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం అని రాజశేఖరరెడ్డి అన్నారు ఏ ఒక్కటి చేయలేదన్నారు.
16న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్న అని విజ్ఞప్తి చేశారు. పొన్నాల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం అని తెలిపారు. అంత సీనియారిటీ గల వ్యక్తి ని పట్టుకుని రేవంత్ రెడ్డి అంత ఘోరంగా తిట్టడం సరి కాదన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నడని గుర్తు చేశారు. పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి నీచమైన మాటలను ఖండిస్తున్నా, దందాలు చేసే బ్రోకర్ రేవంత్ రెడ్డి ఒక మంచి వ్యక్తిని అలా అవమానించడం కరెక్ట్ కాదన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌ను విమర్శించడానికి రేవంత్‌కు అర్హత లేదని హెచ్చరించారు. కేసీఆర్ పై మాట్లాడే అర్హత నీకు ఉందా? అని అడిగారు. జాగ్రత్తగా మాటలాడటం నేర్చుకో అని అన్నారు.
జనగామ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 16న మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న మొదటి మీటింగ్‌కి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్ దయతో జనగామ జిల్లా అయిందని తెలిపారు. అభివృద్ధిలో జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. జనగామను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని పేర్కొన్నారు.