
హైద్రాబాద్ : మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, అభిలాష బిస్త్, డీఐజీ బి. సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితర అధికారులు స్వాగతం పలికారు. తమను మణిపూర్ నుంచి సురక్షితంగా రప్పించిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు కృతజ్ఞతలను తెలిపారు.
మణిపూర్ లో నెలకొన్న పరిస్థితిలలో తెలంగాణ విద్యార్థుల ను సురక్షితంగా స్వరాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మణిపూర్ అధికారుల తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అంజనీ కుమార్ సంప్రదింపులు జరిపి మణిపూర్ రాష్ట్రం నుండి తెలంగాణ విద్యార్థులను తరలించుటకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపుటకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ విద్యార్థుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం.
నేటి మధ్యాహ్నం 1.22 గంటలకు GMR airport కు చేరుకున్న విద్యార్థులు. మణిపూర్ లోని ఇంఫాల్ నుంచి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విమానంలో 72 మంది విద్యార్థులు తెలంగాణ కు చెందిన వారు ఉన్నారు. తెలంగాణ కు చెందిన మొత్తం 130 మంది విద్యార్థుల్లో మిగిలిన విద్యార్థులు ఈ రోజు రాత్రి, రేపు ఉదయం వచ్చే విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. ఇంఫాల్ నుండి మరో విమానం ఈ అర్ధరాత్రి నేరుగా రానున్నది. అలాగే వయా రాయపూర్, పాట్నా, భువనేశ్వర్ ల ద్వారా వచ్చే విమానాల్లో కొంతమంది విద్యార్థులు హైదరాబాద్ రానున్నారు.

“విద్యార్థుల స్పందన”
అక్కడ పరిస్థితి చూస్తే చాలా ఆందోళన చెందాం… మమ్మల్ని సురక్షితంగా హైదరాబాద్ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి రుణపడి ఉంటానని PL Rao చెప్పారు. మణిపూర్ NIT నుంచి 26 మంది Girl Students వచ్చినట్లు సూర్యాపేట కు చెందిన CH స్ఫూర్తి అనే విద్యార్థిని చెప్పారు. State electronic విభాగం ద్వారా MLC కవిత గారితో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. కవిత గారు మాకు ధైర్యం చెప్పారు… మాకు సహకరించారు.
ఘట్కేసర్ కు చెందిన సాయి కిరణ్ మాట్లాడుతూ తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, IT శాఖ మంత్రి KTR గారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో వచ్చారు. మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో నిర్మాణ పనులు చేస్తున్న హై వే కంపెనీ కి చెందిన PL Rao , ఆయన సతీమణి అమిత తో పాటు ఈ ప్రత్యేక విమానంలో వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇంఫాల్ లో 7 ఏండ్ల నుంచి నివసిస్తున్నారు.
