mt_logo

తెలంగాణాలో తాజాగా మరో రూ. 125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన మలబార్ గ్రూప్

-రాష్ట్రంలో ఫర్నిచర్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మలబార్ గ్రూప్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రకటించిన  మలబార్ గ్రూప్, ఇతర రంగాల్లోనూ తన పెట్టుబడిలు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన సంస్థ తాజాగా రాష్ట్రంలో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 125 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్టు సంస్థ తెలియజేసింది. మలబార్ గ్రూప్ పెట్టుబడితో 1000 ఉద్యోగాలు రానున్నాయి

ఈరోజు మంత్రి కే. తారక రామారావు తో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో మలబార్ గ్రూపు ప్రతినిధి బృందం సమావేశం అయింది. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తమ గోల్డ్ రిఫైనరీ మరియు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాలు వేగంగా ముందుకు పోతున్నాయని, ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉన్నదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో 125 కోట్ల రూపాయలతో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడులను కార్యకలాపాలను విస్తరిస్తున్న మలబార్ గ్రూపుకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.