మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలు పార్టీల నాయకులు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారిలో ఎన్సీపీ థానే సిటీ ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్, శివసేన పార్టీ థానే సిటీ ఉపాధ్యక్షుడు తుషార్ వతన్ బర్షికర్, ఎన్సీపీ థానే సిటీ సిక్కు శాఖ అధ్యక్షుడు జగత్ సింగ్, శివసేన పార్టీ థానే బ్లాక్ అధ్యక్షుడు రాజేంద్ర శిర్ధాంకర్, బ్రాహ్మణ సేవా సంఘ్ కార్యదర్శి విపిన్ శర్మ, అమన్ సోషల్ సంస్థ ముంబై ఉపాధ్యక్షుడు అఫాక్ ఖాన్, ఎన్సీపీ మైనారిటీ సెల్ థానే జిల్లా కార్యదర్శి అసాగర్ అలీ ఖాన్‌బండే… ఉన్నారు. వీరికి గులాబి కండువాలు కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు.