mt_logo

నిఖత్ జరీన్ కు  2 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదిక మీద విజయాలను సొంతం చేసుకుంటూ  దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. సచివాలయం లో నిఖత్ జరీన్ సీఎం కేసీఆర్ గారితో గురువారం నాడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ. 2 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.