హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బీ ఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, వివిధ వృత్తులకు చెందిన మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ అభివృద్ధిని, సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలనను చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే. ఇదే పరంపరలో చైతన్యవంతులైన పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు మహిళా రాజకీయ నేతలు సహా ఇతర ముఖ్య నేతలు మంగళవారం నాడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలల్లో సింహభాగం మహిళలకే ప్రాధాన్యత కల్పించడం ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత దార్శనికతకు నిదర్శనమని మహారాష్ట్ర మహిళా నేతలు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో…. కారంజా కార్పోరేటర్ మాలతై సరోదే, మంగళాతాయి అడ్వికర్, బీజేపీ మహిళా అఘాడి చీఫ్ సరికాతై ఠాకరే, శివసేన మహిళా అఘాడి అధ్యక్షురాలు వనితా తై ఢోక్, ఆశి తాలుకా అధ్యక్షురాలు ఆశాతాయి రావుత్, బీఎస్పీ పార్టీ సభ్యులు శిలాతై మెహరే , బెలోరా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చాండతై జాకే, కాంగ్రెస్ పార్టీ సభ్యులు లీలతై మన్హోర్, వాంఖడే గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చాందతై, బిజెపి పార్టీ సభ్యులు తలతై కోరలే, గ్రామపంచాయతీ సభ్యులు మోనికా దిగ్రేస్, బచత్ గట్ అధ్యక్షులు ప్రగతి తాయడే, పార్డీ గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రేమతాయి శిరకార్, పార్డీ గ్రామపంచాయతీ శివసేన పార్ట ఉప సర్పంచ్ అంజుతాయి తిరడ్ కర్, భిషణ్ పూర్ సర్పంచ్ జ్యోతితాయి ధూదాత్, ఆష్టి డిఆర్ఎపి ప్రెసిడెంట్ జయశ్రీ ఫండే, బీజేపీ సభ్యులు హర్షతాయి పాటిల్, సిఆర్పి గట్ 150 మహిళా అధ్యక్షురాలు సరళ ఫాట్ కర్, వడాళ్ళ గ్రామపంచాయతీ శివసేన పార్టీ సర్పంచ్ సీమాతాయి, మహిళా అఘాడీ అధ్యక్షురాలు ఆశాబాయి కాంగలే, మహిళా అఘాడీ సభ్యురాలు వర్షాతాయి మడావీ, కార్జా నగరపంచాయతీ కార్పోరేటర్ మాలాతాయి సరోదే తదితరులు ఉన్నారు