mt_logo

కొత్త సచివాలయంలో రేపు తొలి రాష్ట్ర క్యాబినెట్ భేటీ

హైదరాబాద్: రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. కొత్త సచివాలయం నిర్మించిన తర్వా త జరుగుతున్న క్యాబినెట్ తొలి సమావేశం ఇదే. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుగుతున్న సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.