ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ మైదానంలో కళాభారతి నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎన్టీఆర్ మైదానాన్ని సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రానికి సాంకేతిక విద్య, శిక్షణామండలిని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని అన్వయిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్య, శిక్షణామండలి చైర్మన్ గా సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, మండలిలో సభ్యులుగా పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులతో పాటు 14 మంది నామినేటెడ్ సభ్యులు కొనసాగనున్నారు.