mt_logo

మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్న కేటీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద నిన్న అసెంబ్లీలో దుర్భాషలాడిన సీఎం రేవంత్ రెడ్డి తీరుకి నిరసనగా బీఆర్ఎస్ కార్తీక్ అసెంబ్లీ అవరణలో ధర్నా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కిన సందర్భాలను బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.. వాటి తాలూకు ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని కేటీఆర్ అన్నారు