జర్నలిస్ట్ శంకర్‌పై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిజాలు నిర్భయంగా చెప్తే భౌతిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
సీనియర్ జర్నలిస్టు శంకర్ పైన కాంగ్రెస్ గుండాల దాడితో తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపైనే దాడి.. తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి మొదలయింది అని అన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టు సంఘాలు స్పందించాలి అని కేటీఆర్ కోరారు.