
పలు జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్న.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన బిజీ షెడ్యూల్ గురించి ఓ ట్వీట్ చేశారు. జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు, దొరికిన ఈ కొద్దీ సమయంలో నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల గురించి ఓ నిత్య విద్యార్థిలా పరీక్ష కు ప్రిపేర్ అవుతున్నానని, ఆ విదంగానే తన షెడ్యూల్ ఉందని మంత్రి ట్వీట్ చేసారు.