mt_logo

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ: కేటీఆర్

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు చేసిన పోరాటం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ.. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ పోరాటానికి ప్రపంచ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది అని కొనియాడారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు అని అన్నారు.