మేఘా ఇంజనీరింగ్ సంస్థపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న ప్రత్యేక ఔదార్యంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయమని, ప్రమాదంపైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు.
సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పజెప్పడం ఏంటని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు మేఘా సంస్థపైన ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలిపాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మేఘా ఇంజనీరింగ్ సంస్థపై రేవంత్ రెడ్డి చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తి పైన ఆంతర్యం ఏంటో ప్రజలకు తెలియజేయాలి అని అన్నారు.