mt_logo

మానసిక రుగ్మత నుంచి రేవంత్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో తన మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి ‘చీప్ మినిస్టర్’ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ లాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్‌పై ఘాటు విమర్శలు చేశారు.

చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్, తన వ్యక్తిత్వం, పెంపకం గురించి బయట పెట్టుకున్నాడని చురకలు అంటించిన కేటీఆర్.. రేవంత్ తన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.