mt_logo

కొత్త రాష్ట్ర చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?: కేటీఆర్ ఫైర్

వరంగల్‌లో మున్సిపల్ అధికారులు అనధికార రాజముద్రను వాడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండిపడ్డారు.

అసలు ఎం జరుగుతోందో కనీసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికైనా తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటి? కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు అని అడిగారు.

ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.