mt_logo

రేవంత్‌కి దమ్ముంటే నా మీద మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలి.. కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని.. ఒడితే కాదు అంటావా..కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని రేవంత్‌ని ప్రశ్నించారు.

మగాడివి అయితే.. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయు.. ఆడబిడ్డలకు రూ. 2,500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చెయ్యు అని సవాల్ విసిరారు

అడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇవేం మాటాలు.. రేవంత్‌కు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది.. కొడంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసి.. సవాల్ విసరి పారిపోయిండు..అయన మాటకు విలువ ఏముంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

రేవంత్‌కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయండి.. మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దాం.. అదే అయన సిట్టింగ్ సీటే కదా.. దమ్ముంటే పోటీకి రావాలి.. నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. దమ్ముంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలి అని ఛాలెంజ్ చేశారు.

మరి నాది మేనేజ్మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియంకాలది ఏం కోటా. రేవంత్‌ది పేమేంట్ కోటా… మానిక్కం ఠాకూర్‌కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్ కోటా. పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి అని విమర్శించారు.

బిల్డర్లను బెదిరించాలి.. వ్యాపారులను బెదిరించాలి.. ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు.. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు అని అన్నారు.

అయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు.. అయనకు అయన మీదే సీఎం అన్న నమ్మకం లేదా అని కేటీఆర్ అడిగారు.