mt_logo

ఛలో మేడిగడ్డ: ఉత్తమ్ కూమార్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్

మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మొదటిది కాదు… గతంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయి… కానీ వాటి అప్పటి ప్రభుత్వాలు మరమత్తులు చేసి కాపాడాయి.. కానీ ప్రాజెక్టులను వదిలిపెట్టలేదు అని గుర్తు చేశారు.

ఇలాంటి జరిగినప్పుడు ప్రభుత్వాలు వేంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో రిపేర్లపైన, ఇంజనీరింగ్ పరిష్కారాల దిశగా కార్యచరణ ఉండాలి అని సూచించారు.

ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ కనీసం ఒక్క సాంపిల్ తీసుకున్నదా.. మరి రిపోర్టు ఎప్పుడో వస్తుందో ఉత్తమ్ చెప్పాలి.. అదరాబాదారాగా ఎన్డీఎస్ఏ రిపొర్టు తయారైంది అని విమర్శించారు.

అది రాజకీయ ప్రేరేపిత నివేదిక, అందుకే ప్రభుత్వానికి కన్నా మీడియాకి చేరింది, కేవలం రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రయోజనం కోసం తయారైన నివేదిక అది అని పేర్కొన్నారు

అప్పటి మా ప్రభుత్వం సమాచారం, నివేదికలు ఇవ్వకుంటే మరి సమగ్రమైన రిపోర్టు ఎన్డీఎస్ఏ ఏలా ఇచ్చిందో చెప్పాలి.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సంస్ధలపై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కు అంత నమ్మకం ఎందుకు, కేవలం తమకు అనుకూలంగా ఉన్నందుకేనా…
మరి ఈడి, సీబీఐలపై కూడా ఇంతే నమ్మకం ఉన్నదా చెప్పాలి అని ప్రశ్నించారు.

రైతాంగాన్ని అదుకోవాలన్న సెన్స్, కామన్‌సెన్స్ ప్రభుత్వానికి లేవు.. కిందకుపోతున్న నీళ్లని ఎత్తిపోసేందుకు ఒక పంపుతో అయినా నీళ్లు అందించండి.. ఉత్తమ్ గారు ఉన్న సమస్య ఎంటో తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఉత్తమ్‌కు బ్యారేజీకి, రిజర్వాయర్‌కు తేడా తేలియదు, తెలుసుకోవాలి అని కేటీఆర్ అన్నారు.

మా సలహలు వద్దంటే నిపుణుల కమీటి వేయండి, నాలుగు నెలల్లో కాఫర్ డ్యాం కట్టి మరమత్తులు చేయండి.. ప్రభుత్వం వేంటనే మరమత్తులు చేయాలని డిమాండ్… తప్పు జరిగితే చర్యలు తీసుకొండి అని సూచించారు.

మార్చ్ నెలాఖరునాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. పంటలు ఎండి పోతున్నాయి. ఈరోజు కూడా సూమారు 5వేల క్యూసెక్కుల నీళ్లు కిందకు పోతున్నాయి. సెన్స్ ఉన్న మంత్రి నీళ్లు ఎలా ఎత్తిపోసి, రైతుల పొలాలు ఇవ్వాలో చూడండి అని అన్నారు.

మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తామంటే… వ్యవహరించండి, కానీ రైతులకు నీళ్లు ఇవ్వండి. మాకు న్యాయస్ధానాలపై నమ్మకుంది, అవసరం అయితే కాంగ్రెస్ కక్షపూరిత చర్యలపై పోరాడతాం అని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్న కుట్ర కనిపిస్తుంది. మా సలహాలు వద్దు అన్న మంత్రి, సునీల్ కనుగోలు సలహాలు తీసుకుంటున్నారు.. మా సలహాలు వద్దు అంటే నిపుణుల సలహాలు తీసుకొండి.. ఒక వైపు కాళేశ్వరం విఫలం అంటునే, హైదరాబాద్‌కు నీళ్లు ఇస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కన్యూఫ్యూజన్లో ఉంది అని అన్నారు.

మరి హరీష్ రావు అన్నట్లు చేతకాకుంటే మాకు అప్పజెప్పండి, చేసి చూపిస్తాం.. ఒక్క మేడిగడ్డ బ్యారేజీనే కాళేశ్వరం మాదిరిగా చెప్తున్న ఉత్తమ్, రేవంత్ చేస్తున్న ప్రచారం అపాలి అని తెలిపారు.

పాలమూరు యాత్ర పోటీ యాత్రనే… దృష్టి మరలించడం కోసమే. ప్రాజెక్టు పూర్తి అయింది… కేవలం కాలువలు తవ్వడమే మిగిలింది. పాలమూరు ప్రజలకు మీ యాత్రతో మేము కట్టిన రిజర్వాయర్ల గురించి గుర్తు చేసిన వారు అవుతారు అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరంకు 400 అనుమతులున్నాయి.. వెదిరే శ్రీరాం ఒక్కడే తెలివైన వాడా… అనుమతులు ఇచ్చిన వాళ్లు తెలివిలేని వాళ్లా.. అప్పుడు అనుమతులిచ్చి… ఇప్పుడు ఇవ్వలేదంటే ఎట్లా అని ప్రశ్నించారు.

వెదిరే శ్రీరాం భువనగిరి సీటు కోసం తాపత్రయంతో మాట్లాడుతున్నాడు.. కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ప్రవర్తిస్తుంది అని కేటీఆర్ అన్నారు.