షాద్‌నగర్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సీఎంకేసీఆర్ 2014 లో, 2018 లో సింగిల్‌గానే ఎన్నికలు వెళ్ళారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా సింహం లాగా కేసీఆర్ సింగిల్‌గా ఎన్నికలు వెళ్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలే ఇవి అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి, మోడీకి ఏనాడైనా తెలంగాణను పట్టించుకున్నరా? అని ఆవేశ పడ్డారు. 2014 లో ఈపులు చింతపండు చేస్తామంటే ఈ కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రకటన చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ దొరతో తెలంగాణ కొట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఢిల్లీ దొరలు ఏం చేస్తారో చూద్దామన్నారు. వాళ్ళతో ఎంత దూరమైనా కొట్లడుదాం అని సూచించారు. ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు ఏం చేతకాదని ఎద్దేవా చేసారు. వీళ్ళకి ఏం కావాలన్నా కర్ణాటక, లేదంటే ఢిల్లీకి పోవాల్సిందే అని మండిపడ్డారు.