భద్రాచలం: భద్రాచలం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈరోజు రోడ్ షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం వచ్చినప్పుడు కచ్చితంగా రాముడి పాదాలకి నమస్కరించాలని అనుకున్నాను. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లలేదు..కానీ మరొక పది రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముని దర్శించుకుంటానని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. గతంలో భద్రాచలంలో కరెంటు పరిస్థితి సాగుబడి పరిస్థితి ఎలా ఉంది..ఇప్పుడు మన కేసీఆర్ పాలన తర్వాత ఎలా ఉంది అని అడిగారు.
రాష్ట్రంలో మరోసారి రాబోయేది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేల్చి చెప్పారు. కారణాలు ఏవైనప్పటికీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గులాబీ వనంలో కచ్చితంగా భద్రాచలం చేరాలన్నారు. భద్రాచలం వరదలకు త్వరలో శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం అని అన్నారు. గత రెండు పర్యాయాలు మా ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు.. దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది,ఈసారి మా అభ్యర్థిని గెలిపించండి , వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని హామీ ఇచ్చారు.
నా పేరే తారక రామారావు మాకు రాముడు మీద భక్తి లేకుండా ఎలా ఉంటుంది.. యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత రెండు పర్యాయాలు మా అభ్యర్థిని గెలిపించక పోయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేశాం..ఈసారి పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కానీ ఇప్పటివరకు 11 ఛాన్స్ లు ఇచ్చారు.. కానీ ఆ సన్నాసులు, దగుల్బాజీలు ఏమి అభివృద్ధి చేశారు అని ప్రశ్నించారు. ముళ్ళ చెట్టుకు నీరు పోస్తే కాయలు వస్తాయా, గాడిదకు గడ్డి వేసి ఆవుని పాలు పిండితే ఎలా అందుకని అందుకని కారు గుర్తు అభ్యర్థి తెల్లం వెంకటరావుని గెలిపించాలి అని మంత్రి కేటీఆర్ కోరారు.