కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్న రాహుల్ గాంధీ రేపు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటాడని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోటూరి మానవతారాయ్ ఆరోపించారు. హుల్ గాంధీ కలవాల్సింది కర్ణాటక రాష్ట్ర నిరుద్యోగులను, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కడ నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
రాహుల్ గాంధీకి దమ్ముంటే కర్ణాటక నిరుద్యోగులతో సమావేశం కావాలన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ఓయూ ఉద్యమ నిరుద్యోగ నాయకులకు మరియు ఎన్.ఎస్.యు.ఐ,యువజన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పి ఆ టికెట్లను డబ్బు సంచులకు అమ్ముకున్న రాహుల్ గాంధీ రేపు ఉద్యోగాలను కూడా డబ్బులకు అమ్ముకుంటాడని హెచ్చరించారు.
యువతకు విద్యార్థి నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వని మోసగాడు అయిన రాహుల్ గాంధీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్రంలో రెండు లక్షల 32 వేల ఉద్యోగాల్లో 9:30 సంవత్సరాల్లో ఒక లక్షా 60 వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసింది. భర్తీకి సిద్ధంగా ఉండి ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన ఉద్యోగాల సంఖ్య 42 వేలు, అసలు అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ లేని ఉద్యోగాలని భర్తీ చేస్తానని చెప్పటం హాస్యాస్పదం అన్నారు. 2004 నుండి 2014 వరకు నెలకు రూ.1000 చొప్పున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాలు పదివేల 116 మాత్రమే.
కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 16 వేల ఉద్యోగాలు చొప్పున భర్తీ చేసిందని వివరించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వమే సమాచారం సేకరించి లీకేజీకి పాల్పడిన 100 మందికి పైగా నేరస్థులను అరెస్ట్ చేసింది. నిరుద్యోగుల్లో ఉన్న కొద్ది అసంతృప్తిని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూడటం చిల్లర రాజకీయం అన్నారు.