నల్గొండ: నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..
కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదు, తెలంగాణలో అస్సాం సీఎం, బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు.మత కల్లోలాలు లేపి ఎలాగైనా అధికారంలోకి రావలన్నదే బీజేపీ పార్టీ కుట్ర అన్నారు. కాంగ్రెస్ కు కూడా ఇంకా బుద్ధి రావడం లేదు .నాలుగు రోజులైనా ఇంకా కర్ణాటక లో సీఎం ని నిర్ణయించే స్వేచ్చ ఆ పార్టీ లో లేదన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాంటి నాయకత్వం వహిస్తుందో అనేది ప్రజలు ఆలోచన చేయాలి, కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ వాళ్ళు ఊహల్లో తెలియాడుతున్నారు అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పప్పులు ఉడకవన్నారు.
ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటే యావత్ తెలంగాణ సమాజం నడుస్తుంది, రాజస్థాన్ లో కాంగ్రెస్ కల్లోలం చూస్తూనే ఉన్నాం..అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే తిరుగు బాటు చేసి, రాజకీయ అస్థిరత్వం తెచ్చారన్నారు. మతోన్మాద బీజేపికి, దిక్కు దివానా లేని కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సుఖేందర్ రెడ్డి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యం, కర్ణాటక లో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు, అంతర్గత విభేదాలతో నానాటికి కాంగ్రెస్ పార్టీ కునారిల్లి పోతుంది, కేసీఆర్ గారి నాయకత్వంలోనే దేశం ,రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు శాసనమండలి చైర్మన్ .