mt_logo

దేశానికి, రాష్ట్రానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం… భీంగల్,బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్,బాబాపూర్, గొన్గొప్పల గ్రామాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  సుమారు 200 మంది యువకులు…ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. 

గౌరవ కేసీఆర్,కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతం.. యువత ఆలోచనలో మార్పు మొదలైంది..బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు, ప్రజల మధ్య వైషమ్యాలు,యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలి, దేశ సంపదంతా.. బీజేపీ మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్నాడు. ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఈడి కేసు అంటేనే నేడు ఓ జోక్ అయిపోయింది సీబీఐ,ఈడి,ఐటి లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారని, 

రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు అన్నారు. దేశం మొత్తాన్ని దోచుకుంటున్నది బీజేపీ..అసలు ఈ.డి కేసులు పెట్టాల్సింది బీజేపీ మీదనే.. కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు, దేశంలో ప్రధాని మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు, ధరలు పెంచి సామాన్యుల జీవనం భారం చేశాడన్నారు.  బీజేపీ నీచ రాజకీయాలు,దేశ సంపదను దోచుకుంటున్న తీరుపై గ్రామాల్లో,ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం, దేశానికి, రాష్ట్రానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు మంత్రి.