mt_logo

తెలంగాణ బిడ్డలే దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తయారు చేస్తున్నారు

  •  ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ఐపాస్ 
  • భవిష్యత్తులో ట్రైన్ కు ట్రైనే తయారు

రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేథా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వుయ్ ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాదు. గతంలో తెలంగాణకు ఉన్న ఒక దీంతో తొలిగిపోయింది. తెలంగాణ బిడ్డలే ఈ రోజు  దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి, దాదాపు రూ. 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 ను పూర్తి చేసి, మాన్యుఫాక్చరింగ్ కూడా ప్రారంభించి ఈ రోజు నాతో ప్రారంభింపచేసుకున్నారు.   ఈ ఫ్యాక్టరీ ఇంకా ఇంకా ముందుకు పోవాలి. ఎక్కడ ఏది ప్రగతి పథంలో గుబాలించాలన్నా, ప్రగతి పథంలోకి రావాలన్నీ అందుకు తగిన వాతావరణం ఉండాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ఐపాస్ ను తెచ్చింది. టీఎస్ఐపాస్ ను తెచ్చినం. దాదాపు డెబ్బై ఎనభై దేశాల్లోని విధానాలను పరిశీలించి టీఎస్ ఐపాస్ తెచ్చాం. 

ఫైల్ ఆగిపోతే  రోజుకు 1000 రూపాయల చొప్పున ఫైన్

ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో బిజినెస్ మీటింగ్ లో టీఎస్ఐపాస్ గొప్ప సింగిల్ విండో గా ఎదగబోతోందని నేను చెప్పేవాడిని. ఇది రుజువు అవుతున్నది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను మనం ఆకర్షిస్తున్నాం. 15 రోజుల్లోగా అన్ని అనుమతులిచ్చి స్పష్టత ఇవ్వకపోతే దరఖాస్తుకు ఆమోదం లభించినట్టే అని చెప్పాం. 16 వ రోజు నుండి ఆ దరఖాస్తు అమల్లోకి వస్తుంది. ఏ అధికారి దగ్గర ఫైల్ ఆగిపోయిన రోజుకు 1000 రూపాయల చొప్పున ఫైన్ విధించేలా విధానం రూపొందించాం. ఇటువంటి చర్యల వల్ల పారిశ్రామిక ప్రగతి నమోదవుతున్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతున్నది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వరంగల్ ముద్దుబిడ్డలు కశ్యప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత పెద్ద వెంచర్ తో వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని సీఎం ప్రసంగించారు. 

భవిష్యత్తులో ట్రైన్ కు ట్రైనే ఇక్కడ తయారు 

ఈ సంస్థకు అనుబంధంగా మలేషియన్ కంపెనీతో పాటు మరో నాలుగైదు దేశాల కంపెనీలు కూడా విడిభాగాలను తయారుచేసే పనులు చేస్తున్నాయి. పూర్తి రైల్వే కోచ్ ఇక్కడే తయారు చేసే నిమిత్తం వీరికి ముంబై మోనో రైలు ప్రాజెక్టు రావడం గొప్ప విషయం. భవిష్యత్తులో ట్రైన్ కు ట్రైన్ ఇక్కడ తయారుచేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని  తెలిపారు. ఇక్కడనే కాకుండా ఇతర దేశాలకు కూడా తయారు చేసే విధంగా ఎదుగుతున్నామని వారు తెలిపారు.