mt_logo

బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఫూలేకు ఘన నివాళి: కేసీఆర్

బహుజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11) సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, దేశానికి ఫూలే అందించిన సమ సమాజ కార్యాచరణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.

సబ్బండ వర్గాల కోసం తమ పదేండ్ల పాలనలో అమలు చేసిన పాలనా కార్యక్రమాలను తత్ఫలితంగా చోటు చేసుకున్న సామాజిక ప్రగతి కార్యాచరణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఒకనాడు అల్ప దృష్టితో, నిర్లక్య ధోరణులతో, వెనకబడిన సమాజంగా తెలంగాణను చూశారని, ఉద్యమ కాలం నుంచి రగిలిన సబ్బండ వర్గాల చైతన్యం నూతన రాష్ట్రంలో ప్రగతి పథంలో ముందడుగు వేసిందన్నారు. ఈ మొత్తం క్రమంలో మహాత్మాఫూలే స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ అన్నారు.

తమ పదేండ్ల పాలన కాలంలో అమలయిన పథకాలు కార్యాచరణ, బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసి అన్నిరంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు.. అదే స్పూర్తి కార్యాచరణ కొనసాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఫూలేకు మనమర్పించే ఘన నివాళి అన్నారు.