mt_logo

రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

రంజాన్ మాసం చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సహోదరులకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయన్నారు. 

అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పామని, లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తమ పదేండ్ల పాలనలో నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు.. అదే సాంప్రదాయం కొనసాగాలని కోరుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని కేసీఆర్ ప్రార్థించారు.