mt_logo

డీకే శివకుమార్ సిగ్గుందా? ఇంత దిగజారుడుతనమా?: సీఎం కేసీఆర్

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ సిగ్గుందా ? ఇజ్జత్ ఉందా ? ఇంత దిగజారుడుతనమా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు చేశారని వెల్లడించారు. నిన్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిగి వెళ్లారు,  అక్కడ మా రాష్ట్రంలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారు. అసలు ఆయనకు సిగ్గుందా ? 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడానికి ఇజ్జత్ ఉందా ? ఇంత దిగజారుడు తనమా ? అని విమర్శించారు. 

ఓటును ఆచితూచి వేయాలి 

ఓటు అనేది బ్రహ్మాస్త్రం అని, దానిని ఆచితూచి వినియోగించుకోవాలని సూచించారు. సమైఖ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో ఎవరూ కొట్లాడలేదన్నారు.  నాగార్జున ప్రాజెక్టు పేరు నందికొండ ప్రాజెక్టు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ భాగాన కట్టడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిందని, గోల్ మాల్ చేసి దిగువకు తీసుకువచ్చి ప్రాజెక్ట్ కట్టారని చెప్పారు. ప్రాజెక్ట్‌ను ఆపితే నోర్మూసుకొని కూర్చున్నదెవరని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్ అందరికి శ్రీరామా రక్ష

రైతులు కోరితే మొన్న సాగర్ నుంచి నీళ్లు విడుదల చేశమని, మరోసారి విడుదల నీటిని విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అందరికి శ్రీరామా రక్ష అని చెప్పారు. కాంగ్రెస్ ఉంటే గోదావరి నీళ్లు ఇక్కడి వరకు వచ్చేవా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గత పార్టీలు గతంలో ఏం చేశారు.. భవిష్యత్‌లో ఏం చేశారని ఒక్కసారి ఆలోచించాలని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి.

ఓటు మన చేతిలో బ్రహ్మాస్త్రం

తెలంగాణ రాకముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరికి వచ్చారు. 24 గంటలు రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్త్రం. పంటపొలాలు, ఎండాలా..? పండాలా అనేది మీ ఓటు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కోదాడలో మల్లయ్య యాదవ్ గెలవడు అని చాలా మంది నాతో చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదన్నారు. కానీ ఏది అయితే అది అయింది ఈసారి ఇచ్చి చూద్దామని.. కోదాడ నుంచి మల్లయ్య యాదవ్‌కి టికెట్ ఇచ్చానని పేర్కొన్నారు. మల్లయ్య యాదవ్‌ని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. కోదాడలో బీసీ భవన్ నిర్మిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఆదరాబాదరగా ఓటు వేయొద్దు

ఓటు తలరాత మారుస్తుందని, కోదాడకు నీళ్లు రావాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుందన్నారు. ఎన్నికలు వచ్చాయని ఎదో ఆదరాబాదరగా ఓటు వేయొద్దని, విజ్ఞతతో ఆలోచించి వేయాలని చెప్పారు.ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని సూచించారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్త్రం..  పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుంది. సాగర్ కాలువల కింద పండే పంటలకు మరోదశ నీళ్లు విడుదల చేస్తామని, ఆ బాధ్యత తనదన్నారు.

కర్ణుడికి కవచకుండలలా తెలంగాణకు బీఆర్ఎస్ 

కృష్ణ జలాల కారణంగా కోదాడకు ఇబ్బందులున్నాయని, అందుకే కోదాడకు కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టే, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణ సాధన కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.