mt_logo

అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన

తెలంగాణలో ఎండిన పంటలను త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు.

అందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రూపొందిస్తున్నారు. కేసీఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత భువనగిరి, అలేరులో పంటల పరిశీలనకు వెళ్లనున్నట్టు సమాచారం.

నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ పర్యటించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయి అని అరా తీసిన కేసీఆర్.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలుపెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ  కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.