mt_logo

రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు

మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఎజెండా.. తెలంగాణ హక్కులను కాపాడేది కేసీఆర్. ఓటర్లను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.. పంటలు ఎండుతుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు అని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నాడు.. కేసులు పెడుతున్నాడు.. భూతుల పాలన, బూటకపు పాలన, అబద్ధాల పాలన చూసి ఓటు వేయాలా.. వంద రోజుల పాలనలో ఏముంది.. దండగ తప్పా అని అన్నారు.

ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు.. రూ. 15 వేల రైతుబంధు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటు వేయండి, రాని వాళ్ళు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి.. అవ్వా, తాతలు, నేత, గీత కార్మికులకు రూ. 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసారు.. రూ. 200 పింఛన్ రూ. 2,000లకు పెంచింది కేసీఆర్.. రూ. 2,500లు ఇస్తా అని అక్కా చెల్లెళ్లకు మోసం చేసాడు.. అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని హరీష్ దుయ్యబట్టారు.

180 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఒక్కరిని పరామర్శించలేదు. పార్టీలో చేరికల పై ఉంది మీ ప్రేమ, రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ముంచిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఓడించాలి. ఇవన్ని అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.

చోటే భాయ్, బడే భాయ్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు.. కలిసి రాలేదని కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.. కవితను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్‌లను ఖండిస్తే, రేవంత్ మాత్రం కవిత అరెస్ట్ పట్ల కామెంట్స్ చేస్తాడు.. అదాని చోర్ అని రాహుల్ గాంధీ అంటే, అదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తాడు అని అన్నారు.

గుజరాత్ మోడల్ ఫెయిల్ అని రాహుల్ అంటే, రేవంత్ గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుంటాడు.. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు.