తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వారి నివాసంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులతో సహా ఈ సమావేశానికి ఆహ్వానించడంతో జడ్పీ చైర్మన్లు వారి కుటుంబ సభ్యులు కేసీఆర్ గారితో కలిసి ఫోటోలు దిగారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ జడ్పీ చైర్మన్లను పేరు పేరునా పలకరించారు. ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిలో భాగం పంచుకుని బాగా పని చేసినందుకు వారిని అభినందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో వారి యోగ క్షేమాలను చర్చిస్తూ ఎక్కువ సేపు గడిపారు. ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించారు. భోజన సమయంలో అందరితోనూ ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు.
సమావేశం అనంతరం కేటీఆర్ జడ్పీ చైర్మన్లందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత కేసీఆర్‌ని కలవడం సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్లు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు
జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్ ), కోరిపెల్లి విజయ లక్ష్మి (నిర్మల్ ), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్ ), దఫేదార్ శోభ ( కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీంనగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల ), పటోళ్ల మంజుశ్రీ ( సంగారెడ్డి), ర్యాకల హేమలత (మెదక్), వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతాకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్గొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్ ), మారేపల్లి సుధీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిని (జయశంకర్ భూపాలపల్లి), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం) పాల్గొన్నారు.