బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత అండాళమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
దామోదర్‌రావు మాతృమూర్తి ఆండాలు గతకొంతకాలంగా వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె శనివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.