mt_logo

దుబాయిలో రేవంత్ ఏం చేశాడో బయటపెడితే ఇంటికి వెళ్ళలేడు: కౌశిక్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణను ఎటు తీసుకువెళ్తున్నారో అర్ధం కావడం లేదు. నన్ను రేవంత్ రెడ్డి ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. డ్రగ్స్‌లో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారునేను ప్రైవేట్ ఫంక్షన్‌కి వెళ్తే అక్కడికి డీఎస్పీలు, సీఐలు, కానిస్టేబుల్స్ వచ్చారు. అక్కడ డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ట్రై చేశారు అని ఆరోపించారు.

రాజ్ పాకాల ఇంట్లో అదే జరిగింది అక్కడికి కేటీఆర్ వస్తే డ్రగ్స్ పెట్టి కేటీఆర్‌ను ఇరికించాలని చూశారు. నా కారు చెకింగ్ చేస్తామని అంటే చెక్ చేసుకోమని చెప్పాను. కౌశిక్ రెడ్డి మందు తాగడు అనే విషయం వాళ్లకు తెలియదు. పాడి కౌశిక్ రెడ్డిని ఇరికించకుండా ఎందుకు వదిలేశారని సీఎం ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని తిట్టారు అని తెలిపారు.

మాకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి కౌశిక్ రెడ్డి కారులో పెట్టాలని చెప్పారని పోలీసులు చెప్పారు. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పు ఏంటి.. రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. నా ఇంటి చుట్టూ రోజు ఇంటిలిజెన్స్ వాళ్ళను పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారు. సవాల్‌ను మేము స్వీకరిస్తున్నాము. ఛాలెంజ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఎక్కడికి రావాలో చెప్పు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రావాలి అని సవాల్ విసిరారు.

డ్రగ్స్ టెస్ట్‌కు మేము రెడీగా ఉన్నాము.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారో తేలాలి. రేవ్ పార్టీలో ముసలివాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారా. షబ్బీర్ అలీ చేసే రేవ్ పార్టీలు అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదా? అని అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్, దుబాయిలో ఏం చేశారో చెప్తే ఇంటికి వెళ్ళలేవు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోము. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వాయిస్‌ను మార్ఫ్ చేసి వీడియోలు, ఆడియోల ద్వారా దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు అని పేర్కొన్నారు.

మీరు టెస్టులకు రాకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు భావిస్తాము. కాంగ్రెస్ నేతల బండారం మొత్తం బయటపెడతా.. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించు అని కౌశిక్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదు.. రాష్ట్రంలో దళితబంధు ఎందుకు ఆపారు. పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో చూడలేదు. పోలీసులకు కేసీఆర్ మేలు చేశారు. ఏక్ పోలీస్ అని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొంకనాలు కొట్టారు అని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం. బాల్క సుమన్‌ను పోలీసులు ఇష్టం వచ్చినట్లు తోసేశారు. బాల్క సుమన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అని డిమాండ్ చేశారు.