mt_logo

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెంటనే రద్దు: మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌ను కామారెడ్డి రైతు జేఏసీ బృందం కలసారు.  మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  మరోసారి డీటీసీపీ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. 

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్‌కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపారు.  మంత్రి కేటీఆర్ హామీపై పూర్తి భరోసా ఉందని రైతు జేఏసీ తెలిపారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్న కేటీఆర్, ఈ అంశంలో రాష్ట్ర డీజీపీతో మంత్రి మాట్లాడారు.