డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి ఈరోజు రాజీనామా చేయనున్నారు. ఈమేరకు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా ఎన్నికైన కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లోకి ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. అయితే తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండు పదవులు ఉండకూడదు కాబట్టి ఆయన ఈరోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.
ఇదిలాఉండగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయాలని కడియం శ్రీహరి, ఎంపీ వినోద్ లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలిసి విజ్ఞప్తి చేశారు.