mt_logo

కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలన..? కాంగ్రెస్ తీరుపై సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాడిన అనుచిత భాషను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు..అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి అని శ్రీహరి అన్నారు.

రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది అని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు.. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు.. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు అని తెలిపారు. కంచెలు తొలగిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేమి కంచెలు అని ప్రశ్నించారు.